తనని సింగర్ ఉష ఇమిటేట్ చేయడం గురించి గీతామాధురి స్పందన!
Advertisement
తెలుగులోని సింగర్స్ లో గీతామాధురికి ప్రత్యేకమైన స్థానం వుంది. ఆమె వాయిస్ లోని వైవిధ్యాన్ని ఇష్టపడే అభిమానులు ఎంతోమంది వున్నారు. అలాంటి గీతామాధురిని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సింగర్ ఉష సరదాగా ఇమిటేట్ చేసింది. ఆ విషయాన్ని గురించి ఐ డ్రీమ్స్ ప్రశ్నించగా, గీతామాధురి తనదైన శైలిలో స్పందించింది.

తనని ఉష ఇమిటేట్ చేసిన ఇంటర్వ్యూను తాను చూశానని చెప్పింది. తనని ఆమె ఇమిటేట్ చేసినందుకు చాలా గొప్పగా ఫీలయ్యానని అంది. ఎవరిని పడితే వాళ్లని ఎవరూ ఇమిటేట్ చేయాలనుకోరు. అవతలివారికి ఒక ప్రత్యేకత వున్నప్పుడే అలా ఇమిటేట్ చేస్తూ తమ టాలెంట్ ను చూపుతుంటారు. అందువలన అది తనస్థాయిని పెంచినట్టుగానే భావిస్తూ గొప్పగా ఫీలయ్యానని అంది. నిజానికి తనని ఉష చాలా బాగా ఇమిటేట్ చేసిందనీ, తాను సరదాగా తీసుకుని నవ్వుకున్నానని చెప్పుకొచ్చింది.     
Sat, Oct 14, 2017, 02:30 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View