రెండో ర‌న్ కోసం గంట‌కు 31 కి.మీ.ల వేగంతో ప‌రిగెత్తిన ధోనీ... వీడియో చూడండి

13-10-2017 Fri 13:57
advertisement

అక్టోబ‌ర్ 11న గువ‌హ‌టిలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టీ20 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లో మ‌హేంద్ర‌సింగ్ ధోనీ ర‌న్నింగ్ రికార్డు నెల‌కొల్పారు. మ్యాచ్‌లో రెండో ర‌న్ కోసం గంట‌కు 31 కి.మీ.ల వేగంతో ఆయ‌న ప‌రిగెత్తాడు. ధోనీ ర‌న్నింగ్ విశ్లేష‌ణ వీడియోను స్టార్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది.

`ధోనీ ర‌న్నింగ్‌ రికార్డును ఎవ‌రూ బ్రేక్ చేయ‌లేరు` అంటూ స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ చేసింది. దీనికి నెటిజ‌న్లు ఏకీభ‌విస్తూ వివిధ ర‌కాలుగా స్పందించారు. `ధోనీ బుల్లెట్ ట్రెయిన్ కంటే ఫాస్ట్‌`, `ధోనీ రికార్డు సృష్టిస్తే అంతే ఇక‌.. దాన్ని ఎవ‌రూ దాట‌లేరు` అంటూ కామెంట్ చేశారు. ఇటీవ‌ల ఆగ‌స్టులో నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీని సంద‌ర్శించిన‌పుడు 20 మీట‌ర్ల రేస్‌ను 2.91 సెక‌న్ల‌లో ధోని పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే.

Outrunning @msdhoni seems impossible! Catch the analysis on his -quick runs on #NerolacCricketLive on Oct 13 on Star Sports. pic.twitter.com/rPbtbmsKES
— Star Sports (@StarSportsIndia) 11 October 2017

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement