ఎంగేజ్ మెంట్ అయిందా?... పెళ్లిలోపు కాబోయే భార్యకు చెప్పే అబద్ధాలు ఇవేనట!
Advertisement
గతంలో పెళ్లి నిశ్చయమైన తరువాత, పెళ్లిలోపు వధూవరులు కలుసుకునే సందర్భాలు, మనసువిప్పి మాట్లాడుకునేంత సమయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పెళ్లి చూపులనగానే, బయట ఓసారి కలసి ముచ్చట్లు పెట్టుకునే పరిస్థితి. ఇక ఎంగేజ్ మెంట్ అయిందంటే, ఇక పెళ్లికి ముందు వరకూ ఆ జంట ఆనందానికి హద్దుండదు. కాబోయే భార్యతో షాపింగ్, షికార్లు, సినిమాలు... ఇలా రోజుకో ప్రోగ్రామ్ తప్పనిసరి.

ఇలా బయటకు వెళ్లిన వేళ, తన కాబోయే జీవిత భాగస్వామిని మెప్పించేందుకు పురుషులు 8 ముఖ్యమైన అబద్ధాలు చెబుతారన్నది మానసిక వైద్యల అంచనా. తాను మంచివాడినని చెప్పుకునేందుకు వారు తంటాలు పడుతుంటారట. ఇక ఆ అబద్ధాలు ఎలా ఉంటాయంటే...

*  నేను ఇంతవరకూ ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు.
* నాకు కట్నాలు, కానుకలు వద్దు. ఒక్క జత బట్టలతో మా ఇంటికి వచ్చినా చాలు.
* నీ వాళ్లు నీకెంతో నాక్కూడా అంతే, వారందరి బాధ్యతా నాపై కూడా ఉంటుంది.
* నా కళ్లతో చూడు. నువ్వు నా కంటికి ఎంత అందంగా కనిపిస్తున్నావో!
* నీతో పాటు తిరుగుతుంటే ఎంత బాగుందో... మరెవరితో వెళ్లినా ఇలా అనిపించదు.
* నువ్వు నాకు నచ్చిన ఆ హీరోయిన్లా కనిపిస్తున్నావు.
* నీ ఇంట్లోని ఫలానా వారు నాకు చాలా ఇష్టం
* పెళ్లి తరువాత నిన్ను కష్టపెట్టనులే. నీ పనుల్లో నేను కూడా సహాయపడతా.

ఇవట... అబ్బాయిలు సాధారణంగా చెప్పే అబద్ధాలు! కాగా, ఇటువంటి మాటలు మనసులో ఏ దురుద్దేశం లేకుండా చెప్పే అబద్ధాలేనని, వీటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు మానసిక విశ్లేషకులు.
Wed, Oct 11, 2017, 09:29 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View