ర్యాంప్ మీద‌ హొయ‌లొలికించిన బ్యాడ్మింట‌న్ స్టార్‌!
Advertisement
ప‌సుపు ప‌చ్చ‌ రంగు డిజైన‌ర్ వ‌స్త్రాలు ధ‌రించి బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ ర్యాంప్‌పై హొయ‌లు కురిపించింది. బెంగ‌ళూరులో జ‌రిగిన 'బెంగ‌ళూర్ ఫ్యాష‌న్ వీక్‌'లో ఆమె మొద‌టిసారి ర్యాంప్ వాక్ చేసింది. ప్ర‌ముఖ వ‌స్త్ర‌ డిజైన‌ర్ నీతా లుల్లా రూపొందించిన వ‌స్త్రాలకు సైనా త‌న ఆహార్యంతో కొత్త హంగులు దిద్దింది.

అక్టోబ‌ర్ 7, 8 తేదీల్లో జ‌రిగిన‌ ఈ ఫ్యాష‌న్ వీక్‌లో ప్రియా క‌టారియా, న‌రేంద్ర కుమార్‌, శ్రావ‌ణ్ కుమార్ వంటి డిజైన‌ర్ల దుస్తులు ప్ర‌ద‌ర్శించారు. ఫ్యాష‌న్ వీక్ గ్రాండ్ ఫినాలేలో సైనా నెహ్వాల్ షో స్టాప‌ర్‌గా పాల్గొంది. త‌న కొత్త డిజైన్ల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి సైనా నెహ్వాల్ కంటే మంచి మోడ‌ల్ త‌న‌కు దొర‌క‌లేద‌ని డిజైన‌ర్ నీతా లుల్లా పేర్కొంది. ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఫొటోల‌ను సైనా త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.
Mon, Oct 09, 2017, 12:41 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View