పంజాబీలో అద్భుతంగా మాట్లాడిన బ్రిట‌న్ వైద్యుడు.. వీడియో చూడండి
Advertisement
విదేశీయులు భార‌తీయ భాష‌ల్లో మాట్లాడితే చాలా వింత‌గా అనిపిస్తుంది. బ్రిట‌న్‌లో తాగి రోడ్డు మీద ప‌డిపోయిన ఓ పంజాబీ భార‌తీయుడికి ప్రాథ‌మిక చికిత్స చేయ‌డం కోసం అక్క‌డి వైద్యుడు పంజాబీ మాట్లాడిన విధానం చూస్తే మెచ్చుకోకుండా ఉండ‌లేం. పంజాబీ వ్య‌క్తికి చికిత్స చేస్తూ బ్రిట‌న్ వైద్యుడు జ‌స్టిన్ పంజాబీలో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

వృత్తి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా ఆల్క‌హాల్ ఓవ‌ర్‌డోస్‌తో ఇబ్బంది ప‌డుతున్న వ్య‌క్తిని అత‌డు కూల్ చేసిన విధానాన్ని నెటిజ‌న్లు తెగ‌పొగిడేస్తున్నారు. పంజాబీ వ్య‌క్తి మ‌త్తు ఎక్కువై కింద ప‌డిపోయాడ‌ని అక్క‌డి పారామెడిక‌ల్ సిబ్బందికి ఎవ‌రో కాల్ చేశారు. హుటాహుటిన వారు అక్క‌డికి వ‌చ్చి ఆ వ్య‌క్తికి చికిత్స చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఆల్క‌హాల్ ఎక్కువగా తాగ‌డంతో మొద‌ట పంజాబీ వ్య‌క్తి స‌హ‌క‌రించ‌లేదు. త‌ర్వాత జ‌స్టిన్ పంజాబీలో మాట్లాడగానే ఆ వ్య‌క్తి ఆనంద ప‌డ్డాడు. ఒక డ్యాన్స‌ర్‌ని పొగ‌డ‌టం కోసం తాను పంజాబీ నేర్చుకున్నాన‌ని జ‌స్టిన్ చెప్ప‌డం ఈ వీడియోలో చూడొచ్చు.

Thu, Oct 05, 2017, 03:43 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View