ఏమి దుస్థితి?... ఆన్ లైన్ వేధింపుల్లో మనమే నెంబర్ వన్!
Advertisement
 ఇంటర్నెట్ సేవలు విస్తరించడంతో మహిళలకు ఆన్ లైన్ వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. ఇలాంటి వేధింపుల పరంగా మన దేశం ముందుందని తాజా అధ్యయనం పేర్కొంది. అంతేకాదు, ఇందులో భారత్ నెంబర్ వన్ స్థానంలో నిలవడం మన దుస్థితిని తెలియజెబుతోంది.

నార్టన్ సిమాంటెక్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసియా పసిఫిక్‌ దేశాల్లో కెల్లా ఆన్‌ లైన్‌ వేధింపులు జరిపే దేశాల్లో భారత్‌ అగ్రస్థానం సాధించింది. ఆస్ట్రేలియా, జపాన్‌ వంటి దేశాల కంటే కూడా భారత్ లో ఆన్‌ లైన్‌ వేధింపులు ఎక్కువగా ఉండడం విశేషం. భారత్ లో 1,035 మంది ఈ సర్వేలో పాల్గొనగా ప్రతి 10 మందిలో 8 మంది తాము ఆన్‌ లైన్‌ వేధింపులకు గురైనట్లు వెల్లడించడం విశేషం. 
Thu, Oct 05, 2017, 08:32 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View