ఆన్ లైన్ షాపింగ్ కు, కండరాల్లో క్షీణతకు సంబంధం!
Advertisement
కాలు కదపకుండా షాపింగ్ చేయడం, నిత్యావసరాలకు సైతం ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా, మనకు కావాల్సిన వస్తువులను ఆన్ లైన్ షాపింగ్ ద్వారా తెప్పించుకోవడం ఈమధ్య చాలామందికి బాగా అలవాటైపోయింది. అయితే, ఇలా చేస్తుంటే శారీరక శ్రమ లేకుండా పోయి అనారోగ్యం బారిన పడతారని ఓ అధ్యయనంలో తేలింది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలోని కండరాల్లో క్షీణత కలుగుతుందని, కండరాలను బలపరిచే కొన్నిపద్ధతులను కోల్పోతున్నామని ఛార్టెడ్ సొసైటీ ఆఫ్ ఫిజియో థెరపి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెసర్ కారెన్ మిడిల్ టన్ తెలిపారు.

ఆన్ లైన్ ద్వారా నిత్యావసరాలను, వస్తువులను తెప్పించుకునే బదులు, మనమే స్వయంగా షాపుకు వెళ్లి తెచ్చుకుంటే ఆరోగ్య రీత్యా మంచిదని అన్నారు. నేషనల్ హెల్త్ సర్వీసెస్ సూచనల ప్రకారం, వారానికోసారైనా కొద్దిపాటి బరువులు ఎత్తడం మంచిదని అన్నారు. ఇందుకు ఉదాహరణగా, కిరాణాషాపునకు వెళ్లి నిత్యావసరాలను మోసుకురావడం లాంటివని చెప్పారు. వారం మొత్తం మీద ఏమాత్రం శారీరక వ్యాయామం చేయడం లేదని 65 సంవత్సరాలకు పైబడిన వారిలో ఇరవై నాలుగు శాతం మంది అంగీకరించినట్టు చెప్పారు. తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తడానికి ఆస్కారం మెండుగా ఉంటుందని చెప్పారు.
Sun, Oct 01, 2017, 06:42 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View