తేనెటీగల కారణంగా 90 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరిన విమానం
27-09-2017 Wed 16:55

సాధారణంగా వాతావరణం బాగోలేకపోతేనో లేక ఏదైనా సాంకేతిక కారణం వస్తేనో మినహా విమాన ప్రయాణాలు ఆలస్యం కావు. కానీ ఇండోనేషియాలోని కౌలానాము అంతర్జాతీయ విమానాశ్రయంలోని సిటీలింక్ విమానం ఈ రెండు కారణాల వల్ల కాకుండా మరో ప్రత్యేక కారణం వల్ల తన ప్రయాణాన్ని 90 నిమిషాలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
ఇంతకీ ఆటంకం కలగడానికి కారణం ఏంటో తెలుసా?.... తేనెటీగలు. అవును... బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న విమానం కుడి వైపు రెక్క మీద ఒక్కసారిగా వందల కొద్దీ తేనెటీగలు వచ్చి చేరాయి. దీంతో దాదాపు 90 నిమిషాల పాటు విమాన ప్రయాణాన్ని అధికారులు వాయిదా వేశారు. తేనెటీగలు ఎంతకీ వెళ్లకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి పైపుల ద్వారా నీళ్లు కుమ్మరించి తేనెటీగలను చెదరగొట్టారు.
More Latest News
మునుగోడు టీఆర్ఎస్లో ముసలం... కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక నేతల తీర్మానం
13 minutes ago

విజయమ్మ కారు ప్రమాదం వెనుక కుట్ర ఉంది: ఎంపీ రఘురామ
33 minutes ago

ఈ సైకిల్ కు ముందు చక్రం ఉందా? లేదా?.. దృష్టి భ్రాంతితో గందరగోళం.. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఫొటో!
40 minutes ago

మహిళ అవస్థ చూసి.. పండ్ల బండిని తోసిన చిన్నారి విద్యార్థులు.. నెటిజన్ల ప్రశంసలు.. వీడియో ఇదిగో
1 hour ago
