ప్ర‌పంచంలో అత్యంత బరువైన మ‌హిళ మృతి!
Advertisement
ప్ర‌పంచంలోనే అత్యంత బ‌రువైన మ‌హిళ‌గా రికార్డుకెక్కిన ఈజిప్టుకి చెందిన ఈమ‌న్ అహ్మ‌ద్ మ‌ర‌ణించింది. గ‌త కొన్ని నెల‌లుగా ఆమె బ‌రువు త‌గ్గ‌డం కోసం అబుదాబిలోని బుర్జీల్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. దాదాపు 20 మంది డాక్ట‌ర్లు, స్పెష‌లిస్టుల ఆధ్వ‌ర్యంలో ఈమ‌న్ చికిత్స చేయించుకుంటోంది.

గ‌త వారం మూత్ర‌పిండాల‌కు, హృద‌యానికి ఇన్‌ఫెక్ష‌న్ రావడంతో ఆమె ప‌రిస్థితి క్లిష్టంగా మారింది. డాక్ట‌ర్లు ఎంత‌గా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ ప‌రిస్థితి చేయి దాటిపోవ‌డంతో సోమ‌వారం ఉద‌యం 4:35 గం.ల‌కు ఈమ‌న్ చ‌నిపోయింది. బ‌రువు త‌గ్గే చికిత్స‌ను మొద‌ట్లో ఆమె ముంబైలోని సైఫీ ఆసుప‌త్రిలో తీసుకుంది. అయితే, ఇక్క‌డ చికిత్స నచ్చక‌పోవ‌డంతో ఆమె అబుదాబి వెళ్లింది.
Mon, Sep 25, 2017, 01:42 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View