చిరూ జోడీగా కాదు .. ఆయనని ఢీ కొట్టే పాత్రలో నయనతార!
24-09-2017 Sun 12:06
- నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నయనతార
- నరసింహా రెడ్డిని ఢీ కొట్టే పాత్ర
- అమితాబ్ కూతురు పాత్రలో ప్రగ్యా జైస్వాల్
- అక్టోబర్ చివర్లో సెట్స్ పైకి

'సైరా నరసింహా రెడ్డి' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం నయనతారను ఎంపిక చేసుకోవడంతో, ఇందులో తనే కథానాయిక అని అంతా అనుకున్నారు. కానీ ఆమె పాత్ర నెగెటివ్ షేడ్స్ తో ఉంటుందనీ, నరసింహా రెడ్డిని ఢీ కొట్టే పాత్రలో ఆమె కనిపించనుందనేది తాజా సమాచారం.
విలక్షణమైన పాత్ర కనుకనే నయనతార అయితే పూర్తి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆమెను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రగ్యా జైస్వాల్ ను తీసుకున్నది అమితాబ్ కూతురు పాత్ర కోసమని అంటున్నారు. కథ ప్రకారం చిరంజీవి సరసన ఇద్దరు కథానాయికలు అవసరం కానున్నారు. మరి ఆ పాత్రల కోసం ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను, అక్టోబర్ చివర్లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
More Latest News
అనకాపల్లి జిల్లాలో రాయల్ బెంగాల్ టైగర్ సంచారం.. జీడితోటలో గేదెను చంపితిన్నట్లు గుర్తింపు
6 minutes ago

మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో 144 సెక్షన్
29 minutes ago

జీఎస్టీ ఇక ‘గృహ సర్వనాశన ట్యాక్స్’.. పన్ను పరిధిలోకి మరిన్ని వస్తువులు తేవడంపై రాహుల్ గాంధీ ఫైర్
12 hours ago

'హ్యాపీ బర్త్ డే' మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్!
12 hours ago
