పుట్టి నెల కూడా కాలేదు... అప్పుడే సెరెనా కూతురుకి ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌!
Advertisement
టెన్నిస్ స్టార్ సెరెనా విలియ‌మ్స్ సెప్టెంబ‌ర్ 1న ఓ ఆడ‌బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ పాప‌కు అలెక్సిస్ ఒలింపియా అని పేరు పెట్టారు. పాప ఫొటోల‌ను సెప్టెంబ‌ర్ 13న సెరెనా దంప‌తులు ప్ర‌పంచానికి చూపించారు. మ‌రునాడే అంటే.. సెప్టెంబ‌ర్ 14న పాప కోసం వారు ఇన్‌స్టాగ్రాం అకౌంట్ కూడా క్రియేట్ చేశారు. అలెక్సిస్‌కి సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని వారు అందులో షేర్ చేస్తున్నారు. అలెక్సిస్ మాట్లాడుతున్న‌ట్లుగానే ఫొటోలు పెడుతున్నారు. ఇప్ప‌టికే 5 ఫొటోల‌ను ఈ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. మ‌రో విష‌యం ఏంటంటే... అకౌంట్ క్రియేట్ చేసిన ప‌ది రోజుల్లోనే 61,766 మంది ఈ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. ఈ అకౌంట్‌లో పోస్ట్ చేస్తున్న అలెక్సివ్ ఫొటోలు చాలా ముద్దుగా ఉండ‌టంతో బోల్డ‌న్ని లైకులు కూడా వ‌స్తున్నాయి.
Sat, Sep 23, 2017, 03:15 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View