విదేశీ సెన్సార్ బోర్డు సభ్యుడి 'జై లవ కుశ' సినిమా రివ్యూ... రేటింగ్ ఇవిగో!

20-09-2017 Wed 12:13

జూనియర్ ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్ జంటగా నటించిన 'జై లవ కుశ' సినిమా రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విదేశాల్లో కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అక్కడి సెన్సార్ కు ఈ సినిమాను పంపారు. అక్కడి సెన్సార్ బోర్డ్ సభ్యుడు, ఇండియన్ సినిమాల క్రిటిక్ ఉమేర్ సంధు.. 'జై లవ కుశ' రివ్యూ రేటింగ్ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ఆయన తెలిపారు. ప్రధానంగా ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా పసందైన విందని ఆయన చెప్పారు. డైరెక్టర్ కేఎస్ రవీంద్ర సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారని ఆయన తెలిపారు. స్టోరీ, స్క్రీన్ ప్లే చక్కగా ఉన్నాయని ఆయన చెప్పారు. సినిమాలో మాస్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. స్టంట్స్ సూపర్ అని, క్లైమాక్స్ అదిరిపోయిందని ఆయన తెలిపారు.

 రాశీఖన్నా, నివేదా థామస్ లు ఆకట్టుకున్నారని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్ ఎప్పట్లానే డాన్సులు ఇరగదీశాడని, ఆయన ఫైట్స్ కు కూడా అభిమానులు ఫిదా అవుతారని ఆయన చెప్పారు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అభిమానులను అలరిస్తాయని ఆయన తెలిపారు. అయితే సినిమాలో కొన్ని సీన్స్ సాగదీసినట్టు ఉన్నాయని ఆయన చెప్పారు. ఎడిటింగ్ ఇంకొంచెం మెరుగ్గా ఉంటే బాగుండేదని ఆయన తెలిపారు. ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని, బ్లాక్ బస్టర్ హిట్ అని ఆయన తెలిపారు. ఈ సినిమాకు తాను 3.5 రేటింగ్ ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ పడగా, అన్నదమ్ములైన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ జంట సూపర్ హిట్ తో బోణీ కొట్టిందని ఆయన పేర్కొన్నారు. 

..Read this also
ప్రెస్ నోట్: డిస్నీప్లస్ హాట్ స్టార్ లో అదరగొడుతున్న "వారియర్"!!
 

Exclusive First Review #JaiLavaKusa. #JrNTR Rocked all the way. 3.5*/5* SUPERHIT

A post shared by Umair Sandhu (@sandhuumair) on


..Read this also
'ఖుదీరామ్ బోస్' బయోపిక్ టైటిల్ ను లాంచ్ చేసిన వెంకయ్య నాయుడు
  • విద్యా సాగర్ రాజు దర్శకత్వంలో తెర‌కెక్కిన 'ఖుదీరామ్ బోస్'
  • ఈ చిత్రం ద్వారా నిర్మాత‌గా ఎంట్రీ ఇస్తున్న విజయ్ జాగర్లమూడి
  • షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మైన చిత్రం

..Read this also
'మాచర్ల'తో నా ముచ్చట తీరింది: నితిన్
  • పొలిటికల్ టచ్ తో సాగే 'మాచర్ల నియోజకవర్గం'
  • రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
  • ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న టీమ్
  • డాక్టర్ కావాలని ఉండేదన్న కృతి


More Latest News
Dwayne Bravo becomes first cricketer to take 600 wickets in T20s
Johnson and Johnson to stop selling talc based baby powder globally in 2023
What freebies does Chief Justice of India get asks RLD chief Jayant Chaudhary
ATM washed away in floods in uttarakhand
Rahul Gandhi Shares pictures with sister priyanka gandhi on the eve of Raksha Bandhan
Video of a man smoking on plane goes viral
Disney Plus Hotstars new gem Warrior The ultimate fight between Satya and Guru
UP constable complaint on food quality
Arjun Tendulkar to play for Goa in this domestic season
Visakha RK Beach Sand Transform into Black
Andhrapradesh Govt impose impact fee
Rajasthan Government Bans Animal Fairs to Control Lumpy Skin Disease
Komatireddy Raj Gopal Reddy Fires on Gutha Sukender Reddy
ex vice president venkaiah naidu releases Khudiram Bose title first look
kodali nani hits back tdp over ysrcp mp gorantla madhav issue
..more