స‌మంత పెళ్లి డ్రెస్ ఇదేనా?.. ఫొటోలు షేర్ చేసిన న‌టి
Advertisement
అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత పెళ్లి వేడుక ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్ల ప‌నిలో ప‌డ్డాయి. పెళ్లి కూతురు స‌మంత కూడా పెళ్లిలో ధ‌రించాల్సిన దుస్తుల వేట‌లో ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే ఓ లెహంగా ధ‌రించిన ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. బ‌హుశా... ఇదే త‌న పెళ్లిలో ధ‌రించ‌బోయే లెహంగా అవుతుందేమోన‌ని ఆమె పేర్కొంది.

తాను ధ‌రించిన లెహంగాను రూపొందించిన డిజైన‌ర్ క్రేషా బ‌జాజ్‌ను ఆమె పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తింది. స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల నిశ్చితార్థం రోజున స‌మంత క‌ట్టుకున్న చీర‌ను కూడా క్రేషా బ‌జాజ్ రూపొందించిన సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 6, 7 తేదీల్లో ప‌శ్చిమ గోవాలో వీరి వివాహం జ‌ర‌గ‌నుంది. హైద్రాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్ష‌న్ కూడా ఏర్పాటు చేయ‌నున్నారు.

If there is one person I know who has all the talent all the sass all the beauty with her heart in the absolutely right place it is my doll of a friend @kreshabajaj . Her love story lehangas are straight out of a fairy tale and if there is anyone I would trust for my wedding it would be her ,and so I have . Can't wait @koecsh . Love you @kreshabajaj

A post shared by Samantha Ruth Prabhu (@samantharuthprabhuoffl) on

Tue, Sep 19, 2017, 02:36 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View