రోజూ ఇంటి భోజనం చేస్తున్నారా? అయితే, టైప్ 2 మధుమేహం మీకు దూరమే!


Advertisement
ఇంటి భోజనం చేసేవారికి శుభవార్త... నిత్యం ఇంటి భోజనం చేసేవారికి టైప్ 2 మధుమేహం దూరంగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దాని వివరాల్లోకి వెళ్తే...అమెరికాలోని టీహెచ్‌ చాన్‌ స్కూల్‌ ఆప్‌ పబ్లిక్‌ హెల్త్‌, మరికొన్ని సంస్థలు టైప్-2 మధుమేహంపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధన కోసం 1986-2012 మధ్య కాలంలో 58,051 మంది మహిళలతో పాటు, 1986-2010 మధ్య కాలంలో 41,676 పురుషుల ఆహారపుటలవాట్లను పరిశీలించారు.

వారిలో మొత్తం 9,325 మంది టైప్‌-2 మధుమేహం బారిన పడినట్లు గుర్తించారు. వారిలో ఎక్కువ మంది వివిధ హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో భోజనం చేసే వారుగా గుర్తించారు. అదే సమయంలో ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని తిన్న వారిలో టైప్‌-2 మధుమేహం వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. దీంతో హోటల్, హాస్టల్ వంటి ఇతర ప్రాంతాల్లో భోజనం చేసే కంటే ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని తినేవారిలో టైప్-2 మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువని తెలిపారు. 
Mon, Sep 18, 2017, 12:06 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View