షుగర్ వ్యాధి గ్రస్తులకు మేలు చేసే ఆలివ్ ఆయిల్!
Advertisement
షుగర్ వ్యాధిగ్రస్తులకు ఆలివ్ ఆయిల్ ఎంతో మేలు చేస్తుందట. ఆలివ్ ఆయిల్ లోని ఓ రసాయనానికి ఈ వ్యాధిని నివారించే లక్షణం ఉన్నట్టు పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. వ్యాధిపై పోరాడేందుకు ఈ రసాయనం పనిచేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఆలివ్ నుంచి సేకరించిన రసాయన పదార్థం ఒలెయురోపీన్ శరీరం మరింత ఎక్కువగా ఇన్సులిన్ స్రవించేలా చేస్తుందని అమెరికాలోని వర్జీనియా పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్, స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు గుర్తించారు. అయితే, ఇదే రసాయనం టైప్-2 మధుమేహంలో హానికరంగా ప్రవర్తించే అమైలిన్ ను నిర్విషీకరణ చేయడం ద్వారా తోడ్పడుతుందని తేల్చారు. ఈ అధ్యయనం ద్వారా ఆలివ్ ఉత్పత్తులతో ఒనగూరే శాస్త్రీయ ప్రయోజనాలపై అవగాహన పెరుగుతుందని పరిశోధకులు చెప్పారు.
Thu, Sep 14, 2017, 09:39 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View