ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ గురించిన వివరాలు... విశేషాలు!
Advertisement
అహ్మదాబాద్‌లో బుల్లెట్ రైలు మార్గం నిర్మాణానికి నేడు ఇండియా, జపాన్ ప్రధానులు నరేంద్రమోదీ, షింజో అబేలు కలిసి శంకుస్థాపన చేయనున్నారు. ముంబయి - అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల మేర రైలు మార్గం నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైలు విశేషాలు ఏంటో చూద్దాం..
* బుల్లెట్ రైలు 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల్లో చేరుకుంటుంది.
* ఈ రైలులో మొత్తం పది కోచ్‌లు ఉంటాయి. సామర్థ్యం 750 మంది
* ప్రతి రోజు 36 వేల మందిని గమ్యానికి చేరుస్తుంది.
* 2053 నాటికి రోజూ 1.86 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా.
* రైలు పట్టాలెక్కాక ప్రస్తుతం అనుకుంటున్న పది కోచ్‌లను 16 కోచ్‌లకు పెంచే ప్రణాళిక ఉంది.
* ప్రతిరోజు ఒకే దిశలో 35 బుల్లెట్ రైళ్లు ప్రయాణిస్తాయి.
* ప్రాజెక్టు నిర్మాణ వ్యవధి 5 ఏళ్లు
* ఈ ఐదేళ్లలో నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.1.10 లక్షల కోట్లు.
* ఏడాదికి రూ.20 వేల కోట్లు
* 50 ఏళ్లలో తిరిగి చెల్లించేలా జపాన్ నుంచి 0.1 వడ్డీ రేటుతో 88 వేల కోట్లు రుణం తీసుకున్నారు.
* రైలు మార్గ నిర్మాణంలో 120 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వాడనున్నారు.
* 55 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం కానుంది.
* 15 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుమును ఉపయోగించనున్నారు.
* 16 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది.
* 4 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది.
* 20 వేల మంది నిర్మాణ రంగ కార్మికులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
* రైలు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు
* గరిష్ట నిర్వహణ వేగం 320 కిలోమీటర్లు
* రైలు మార్గంలో 21 కిలోమీటర్ల మేర టన్నెల్ ఉంది. ఇందులో సముద్రం అడుగు నుంచి (థానే క్రీక్) నుంచి ఏడు కిలోమీటర్లు ఉంది.
* వడోదరలోని రైల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ 4 వేల మందికి శిక్షణ ఇవ్వనుంది.  
Thu, Sep 14, 2017, 08:15 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View