ఓనం నృత్యం చేసిన క్రైస్త‌వ సన్యాసినులు... వీడియో షేర్ చేసిన శశిథ‌రూర్‌... మీరూ చూడండి!
Advertisement
సెప్టెంబ‌ర్ 4న కేర‌ళ వ్యాప్తంగా ఓనం పండుగ‌ను అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి క్రైస్త‌వ స‌న్యాసినులు చేసిన ఓనం నృత్యం చేస్తున్న వీడియోను తిరువ‌నంత‌పురం కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ త‌న ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. కొద్దిసేప‌ట్లోనే ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఓనం సంద‌ర్భంగా వేసిన పూక్క‌ల‌మ్ (పూల‌తో వేసిన ముగ్గు) చుట్టూ సంప్రదాయ‌క తిరువ‌త్తిర‌కాలీ నృత్యం వేయ‌డం ఈ వీడియోలో చూడొచ్చు. `కేర‌ళ‌ను `గాడ్స్ ఓన్ కంట్రీ` అని ఇందుకే అంటారు. క్రైస్త‌వ స‌న్యాసినులు ఇలా హిందూ నృత్యం చేయ‌డం కేర‌ళ‌లో సాధార‌ణ‌మే. మ‌తాల మ‌ధ్య ఏక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించ‌డ‌మే ఓనం ప్ర‌త్యేక‌త‌` అని శ‌శి థ‌రూర్ పోస్ట్ చేశారు.

Tue, Sep 05, 2017, 12:00 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View