మతిమరుపుతో బాధపడుతున్నారా? అయితే, ఇలా చేయండంటున్న పరిశోధకులు!
Advertisement
మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా? ఏదైనా పని చేయాలనుకుని మర్చిపోతున్నారా? లేదా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన వస్తువులు మర్చిపోతున్నారా? ఇలాంటి మతిమరుపుకు కెనడాలోని రాట్ మన్ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు పరిష్కారం సూచిస్తున్నారు. చిన్న చిట్కాతో దీనిని పరిష్కరించవచ్చని వారు చెబుతున్నారు. రెండు వస్తువులను అనుసంధానించడం ద్వారా మతిమరుపుకు చెక్ చెప్పవచ్చని వారు సూచిస్తున్నారు.

 ఉదాహరణకు గొడుగును బయటకు తీసుకెళ్లాలనుకుంటే దానిని గుర్తుంచుకునేందుకు బయటకు వెళ్లే సమయంలో చేసే పనికి దానిని అనుసంధానించాలని చెబుతున్నారు. అంటే గొడుగును తలుపు గడియకు తగిలించాలని చెబుతున్నారు. ఆ గడియ వేస్తే కానీ తాళం వేయడానికి వీలు కాదు కనుక గడియకు ఉన్న గొడుగును చూడడం, దానితో మర్చిపోకుండా దానిని తీసుకెళ్లడం జరుగుతుందని వారు చెబుతున్నారు. అలాగే ఏ వస్తువును తీసుకెళ్లాలనుకున్నా దానిని మరో వస్తువుతో అనుసంధానం చేయాలని వారు సూచిస్తున్నారు. దాని వల్ల మతిమరుపును అధిగమించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 
Tue, Aug 15, 2017, 06:10 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View