కేన్సర్ ను తొలి దశలోనే గుర్తించే రక్తపరీక్ష!
Advertisement
కేన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తించే రక్త పరీక్షను అమెరికా స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. కేన్సర్ కణాల అభివృద్ధి, వ్యాప్తిని పాలిమరేజ్ చైన్ రియాక్షన్ పరీక్ష ద్వారా సులువుగా కనిపెట్టవచ్చని అంటున్నారు. ఈ పరీక్ష ద్వారా కేన్సర్ కణాలు విడుదల చేసిన అతిచిన్న డీఎన్ఏ లలోని జన్యు పరివర్తనాలను సులువుగా గుర్తించవచ్చని, ప్రతి చెకప్ లోనూ అప్పటికప్పుడే రోగిలోని కేన్సర్ కణాల వృద్ధి, వ్యాప్తిని తెలుసుకోవచ్చని అసోసియేట్ ప్రొఫెసర్ హాన్లీ పీజి చెప్పారు. ఈ పరీక్షను సాధారణ లేబొరేటరీల్లోనూ చేయవచ్చని, నిపుణుల పర్యవేక్షణ అవసరం లేకుండానే ఎవరైనా సులువుగా పరీక్ష చేసుకోవచ్చని చెప్పారు.
Tue, Aug 15, 2017, 09:09 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View