కూతురు మాట‌ల‌పై న‌మ్మ‌కం లేక సెల్ఫీలు అడుగుతున్న త‌ల్లి!
Advertisement
ఆడ‌పిల్ల బ‌య‌ట‌కెళ్తే `ఎక్క‌డున్నావ్?`, `ఏం చేస్తున్నావ్?`, `ఎప్పుడొస్తావ్?` అని త‌ల్లి ప్ర‌శ్నించ‌డం కామ‌నే! ఇంకా కొద్దిగా ఎక్కువ‌ ర‌క్ష‌ణ చూపించే త‌ల్లి అయితే `నువ్వు చెప్పింది నిజ‌మేనా? ఒక‌సారి నీ ప‌క్క‌న వాళ్లతో మాట్లాడించు!` అంటుంది. కానీ ఈ మోడ్ర‌న్ త‌ల్లి మాత్రం కూతురు మాట‌ల‌పై న‌మ్మ‌కం లేక సెల్ఫీలు పంపించ‌మని అడుగుతోంది, అవి కూడా తాను చెప్పిన విధంగా!

అమెరికాలోని ఓహాయో ప్రాంతంలో నివ‌సించే కెల్లీ డెమోన్ త‌ను బ‌య‌టికి వెళ్లిన‌పుడు త‌న త‌ల్లి చూపించే ఓవ‌ర్ ప్రొటెక్ష‌న్ గురించి ట్విట్ట‌ర్‌లో షేర్ చేసుకుంది. స్నేహితుల ఇంటికి వెళ్లిన‌పుడు త‌న త‌ల్లి అడిగే సెల్ఫీలు ఎలా ఉంటాయో? షేర్ చేసింది. మ‌రీ విచిత్రంగా ఒక మెసేజ్‌లో తాను పంపిన ఫొటో మార్ఫింగ్ చేసిన‌ట్లుగా ఉంద‌ని, త‌న స్నేహితురాలి వెన‌కాల నిల్చుని దిగిన సెల్ఫీ పంపించ‌మ‌ని అడ‌గ‌డం దారుణ‌మ‌ని డెమోన్ పేర్కొంది. అవి చూసిన నెటిజ‌న్లు 'మా అమ్మ కూడా ఇంతే!' అంటూ త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు.
Thu, Aug 03, 2017, 05:09 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View