పది గంటల శ్రమ అనంతరం అద్భుతం సాధించిన గుంటూరు వైద్యులు
Advertisement
గుంటూరు వైద్యులు అద్భుతమైన సర్జరీ చేసి విజయం సాధించారు. టింబర్ మిషన్ లో పడి పూర్తిగా తెగిపోయిన ఒక వ్యక్తి అరచేయిని ఆపరేషన్ ద్వారా మళ్లీ అతికించి అద్భుతం చేశారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... గుంటూరులోని టింబర్ డిపోలో పని చేసే రవి అనే కార్మికుడు చేయి ప్రమాదవశాత్తూ మిషన్ లో పడిపోయింది. దీంతో మోచేతి నుంచి అరచేయి పూర్తిగా వేరైపోయింది. తెగిపడిన అరచేతితో ఆసుపత్రిలో చేరిన రవికి డాక్టర్ మారుతి ప్రసాద్ సారధ్యంలోని బృందం శస్త్రచికిత్స నిర్వహించింది. సుమారు పది గంటలపాటు శ్రమించిన వైద్యులు విజయవంతంగా అరచేతిని మోచేతితో కలిపారు. ఇప్పుడా చేయి సాధారణంగా ఉండడం విశేషం. దాని కట్లు, కుట్లు విప్పిన తరువాత ఫిజియో థెరపీ అనంతరం ఆ చేయి సాధారణంగా పని చేస్తుందని వైద్యులు విశ్వాసం వ్యక్తం చేశారు. 
Fri, Jul 21, 2017, 11:55 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View