ముంబైలో నోరూరిస్తున్న 'గాడ్ ఫాద‌ర్‌' బ‌ర్గ‌ర్‌.. ఒక్కటి తింటే చాలు!
Advertisement
మామూలుగా రెండు బ్రెడ్ల మ‌ధ్య కొంత మాంసం పెట్టి, మాంసం క‌నిపించ‌కుండా ఛీజ్ వేసి బ‌ర్గ‌ర్ త‌యారుచేస్తారు. ముంబైలోని హౌరా ప్రాంతంలోని ఓ బేక‌రీలో కూడా బ‌ర్గ‌ర్ ఇలాగే చేస్తారు. కాక‌పోతే మాంసం ప‌రిమాణమే కొంచెం అధికంగా ఉంటుంది. కొంచెం అంటే త‌క్కువ కాదు దాదాపు ప‌న్నెండు లేయ‌ర్ల‌లో ఉంటుంది. ఇంత మాంసం ద‌ట్టించి 7 ఇంచుల పొడవుగా త‌యారు చేసిన ఈ బ‌ర్గ‌ర్ పేరు గాడ్ ఫాద‌ర్ బ‌ర్గ‌ర్‌. దీన్ని తిన‌డానికి బ‌ర్గ‌ర్ ప్రియులు క్యూ క‌డుతున్నారు.

ఒక్క‌టి తింటే ఇక రోజంతా ఏం తినాల్సినా అవ‌స‌రం లేదంటూ ఐటీ ఉద్యోగులు తెగ తినేస్తున్నారు. అలాగే కొంత‌మంది `ఈ బ‌ర్గ‌ర్‌ను ఎంత సేప‌ట్లో తిన‌గ‌ల‌వు?`, `ఎన్ని తిన‌గ‌ల‌వు?` అంటూ బేక‌రీలో పోటీలు కూడా పెట్టుకుంటున్నారు. `మ్యాన్ వ‌ర్సెస్ ఫుడ్‌` అనే టీవీ కార్య‌క్ర‌మంలో చూసి ఈ బ‌ర్గ‌ర్‌ను త‌యారుచేసిన‌ట్లు బేక‌రీ యాజ‌మాన్యం తెలిపింది. ఒక్క బ‌ర్గ‌ర్‌ను రూ. 700 పెట్టి కొనుక్కుని ఇద్ద‌రు సుష్టుగా తినొచ్చ‌ని వారు చెబుతున్నారు.

Burgers over pizzas #foodporn#godfatherburger#burgerlover#loadsofcalories#cheatdaywednesday#burgersoverpizzas#howraburger#foodie#comfortfood#takemeback

A post shared by Abhishek Hatode. (@abhi41095) on

Wed, Jul 19, 2017, 12:21 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View