ఫేస్‌బుక్‌ యూజర్ల విషయంలో అమెరికాను మించిపోయిన భారత్‌
Advertisement
భార‌త్‌లో ఫేస్‌బుక్‌ను వాడుతోన్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిపోతోంది. ప్ర‌పంచంలో ఫేస్‌బుక్‌కి ఎక్క‌డా లేనంతా క్రేజు ఇప్పుడు ఇండియాలో ఉంది. ఫేస్‌బుక్ సంస్థ ఇటీవ‌లే త‌మ యూజ‌ర్ల సంఖ్య  2 బిలియన్‌ల‌కు చేరింద‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అందులో ఎక్కువ యాక్టివ్‌ యూజర్లున్న అతిపెద్ద దేశం ఇండియానేన‌ని పేర్కొంది. భార‌త్‌లో మొత్తం 241 మిలియన్‌ మంది యాక్టివ్‌ యూజర్లు ఉంటే అమెరికాలో 240 మిలియన్ మంది యాక్టివ్‌ యూజర్లున్నారని చెప్పింది.

ఇంత‌కు ముందు పేస్‌బుక్‌కి అత్య‌ధిక యాక్టివ్ యూజ‌ర్లు ఉన్న దేశంగా అమెరికా మొద‌టిస్థానంలో ఉండేది. ఇప్పుడు అమెరికాను ఈ విష‌యంలో భార‌త్‌ అధిగ‌మించింది. భార‌త్‌లో ఆరునెలల కాలంలో యాక్టివ్‌ యూజర్లు 27 శాతం పెరిగారని, అమెరికాలో మాత్రం 12 శాత‌మే పెరిగార‌ని  నెక్ట్స్‌ వెబ్ తెలిపింది. ఇండియాలో ఫేస్‌బుక్ వాడుతున్న వారిలో 50 శాతానికి పైగా యూజర్లు 25 ఏళ్ల లోపు వారే ఉన్నార‌ని పేర్కొంది.
Fri, Jul 14, 2017, 01:39 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View