కేటీఎం బ్రాండ్‌ బైక్‌ల ధరలు రూ.8,600ల మేరకు తగ్గాయ్!
Advertisement
ఈ నెల 1 నుంచి అమ‌లులోకి వ‌చ్చిన జీఎస్టీ ప్ర‌భావంతో ఇత‌ర కంపెనీల బాట‌లోనే న‌డుస్తూ కేటీఎం బ్రాండ్‌ తన బైక్ ల ధరలను రూ.8,600ల మేరకు తగ్గించింది. భారత్‌లో ఈ బ్రాండ్‌ బైక్‌లు అధికంగా అమ్ముడుపోతున్నాయి. 350 సీసీ ఎటిఎఫ్ కెటిఎమ్ లో ల‌భ్య‌మ‌వుతున్న‌ 200 డ్యూక్, ఆర్‌సీ 200, 250 డ్యూక్‌ ఎక్స్ షోరూమ్ ధరలపై ఈ త‌గ్గింపును పొంద‌వ‌చ్చ‌ని బజాజ్ ఆటో ప్ర‌క‌టించింది. కేటీఎం బ్రాండ్‌లో బజాజ్‌ ఆటోకి 49 శాతం వాటా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ బైక్‌ల‌పైనే కాక‌ అదనపు సెస్‌ కారణంగా 350 సీసీ పరిధిలోని 390 డ్యూక్, ఆర్సి 390 ల ఎక్స్-షోరూమ్ ధరలు కూడా త‌గ్గాయి. వీటికి రూ. 5,900  మేర త‌గ్గించిన‌ట్లు బ‌జాజ్ పేర్కొంది. కేటీఎం ఈ ఏడాది సుమారు 50వేల బైక్‌లను విక్రయించాలని ధ్యేయంగా పెట్టుకుంది.
Thu, Jul 06, 2017, 08:22 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View