సీఆర్డీయేపై విమర్శలు గుప్పించిన టీడీపీ ఎమ్మెల్మే మోదుగుల
ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీయే)పై టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. విజయవాడకు ఇచ్చిన ప్రాధాన్యతను గుంటూరుకు సీఆర్డీయే ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇళ్లు కట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని, మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. కాంట్రాక్టర్ల తప్పిదాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, పేదల ఇళ్లు కొనుగోలు చేసే పెద్దలను అరెస్టు చేయాలని అన్నారు.
Copyright © 2017; www.ap7am.com