ఇరవై నాలుగు గంటల్లోగా జగన్, సాక్షి పత్రిక నాకు క్షమాపణలు చెప్పాలి: మంత్రి జవహర్
తప్పుడు కథనాలు ప్రచురించినందుకు గాను వైఎస్సార్సీపీ అధినేత జగన్, సాక్షి పత్రిక తనకు ఇరవై నాలుగు గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. సాక్షి పత్రికలో వెలువడ్డ ‘మందుచూపు’ కథనంపై ఆయన మండిపడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే కనుక తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఆరోపణలు నిరూపించలేని పక్షంలో జగన్ రాష్ట్రం విడిచి పోవాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్, సాక్షి పత్రిక ఇరవై నాలుగు గంటల్లోగా తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నారు.
Copyright © 2017; www.ap7am.com