రామ్‌నాథ్‌ అభ్యర్థిత్వం పట్ల బీహార్ సీఎం హర్షం.. మ‌ద్దతు ఇచ్చే అంశంపై మాత్రం ఇప్పుడే చెప్పలేమన్న నితీశ్
ఎన్డీఏ తమ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బీహార్ గవర్నర్, దళిత నేత రామ్‌నాథ్‌ను ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. ఈ రోజు పాట్నాలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... రామ్‌నాథ్ ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల తాను వ్య‌క్తిగ‌తంగా సంతోషిస్తున్న‌ట్లు వ్యాఖ్యానించారు. అయితే, ఆయ‌న‌కు త‌మ పార్టీ మ‌ద్ద‌తు ఇస్తుందా? లేదా? అన్న విష‌యం పట్ల స‌మాధానం ఇవ్వ‌లేదు. ఆ విష‌యాన్ని తాము ఇప్పుడే స్ప‌ష్టం చేయ‌లేమ‌ని చెప్పారు. త‌మ రాష్ట్ర‌ గ‌వ‌ర్న‌ర్‌గా రామ్‌నాథ్ ఎంతో బాగా ప‌నిచేశార‌ని అన్నారు. త‌మ‌ ప్ర‌భుత్వంతో  రామ్‌నాథ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. 
Copyright © 2017; www.ap7am.com