కేఎఫ్సీ, కోక్, పెప్సీ లాంటి కంపెనీలు దేశాన్ని దోచేస్తున్నాయి: మంత్రి ప్రత్తిపాటి
కేఎఫ్సీ, కోక్, పెప్సీ లాంటి కంపెనీలు దేశాన్ని దోచేస్తున్నాయని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విదేశీ కంపెనీలు దేశాన్ని, రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని మండిపడ్డారు. మల్టీపెక్స్ లు, మాల్స్ లో దగా చేస్తున్నారని, ప్రజలు నిలదీయాలని, అధిక ధరలకు విక్రయిస్తే 1100కి కాల్ చేయాలని ఆయన ప్రజలకు సూచించారు. అధిక ధరలకు విక్రయిస్తున్న నాలుగు షాపులపై కేసులు నమోదు చేశామని చెప్పారు.
Copyright © 2017; www.ap7am.com