గుజరాత్ డిప్యూటీ సీఎంకు చేదు అనుభవం!
గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. వల్సాడ్ లోని ఓ ప్రారంభోత్సవ కార్యక్రమం నిమిత్తం ఈ రోజు ఆయన అక్కడికి వెళ్లారు. అదే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఓ మహిళా కార్పొరేటర్ కూడా వెళ్లారు. నితిన్ పటేల్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయన పైకి సదరు మహిళా కార్పొరేటర్ గాజులు విసిరారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Copyright © 2017; www.ap7am.com