సూపర్ నైట్ ఆఫర్... రూ.6 కే అన్ లిమిటెడ్ డేటా ఆఫర్ ప్రకటించిన వొడాఫోన్
టెలికాం కంపెనీ వొడాఫోన్ భార‌త్‌లో సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. వొడాఫోన్ సూపర్ నైట్ పేరుతో అన్ లిమిటెడ్ డేటాను అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్ ప్ర‌యోజ‌నాల‌ను వినియోగ‌దారులు రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 6 గంటల వరకు పొంద‌వ‌చ్చని తెలిపింది. త‌మ వినియోగ‌దారులు ఒక్క గంట అప‌రిమిత ఇంట‌ర్నెట్‌ను కేవ‌లం ఆరు రూపాయలకే పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది. 29 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత 3జీ/4జీ డేటాను, డౌన్ లోడ్స్ ను ఐదు గంటల పాటు పొంద‌వ‌చ్చ‌ని పేర్కొంది. ఈ ఆఫ‌ర్‌ను రోజులో ఏ సమయంలోనైనా యాక్టివేట్ చేసుకుని, రాత్రి 1 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాడుకోవ‌చ్చ‌ని తెలిపింది.      
Copyright © 2017; www.ap7am.com