ఈ సినిమా కోసం వంట చేయడాన్ని బాగా పరిశీలించా: అల్లు అర్జున్
అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ, ఈ చిత్రంలో వంటవాడి పాత్రలో నటించానని చెప్పాడు. అయితే, వాస్తవానికి తనకు వంట చేయడం రాదని, ఇంట్లో కూడా ఎప్పుడూ వంట చేయలేదని, ఈ సినిమా కోసం వంట చేయడాన్ని బాగా పరిశీలించి మరీ, నటించానని చెప్పాడు. ఈ చిత్రంలో పాత్ర కోసం బ్రాహ్మణ యువకుడు ఎలా ఉంటాడు, అతడి నడవడిక ఎలా ఉంటుంది? తదితర విషయాలపై కొంత మంది పండితుల దగ్గర పది రోజుల పాటు శిక్షణ తీసుకున్నట్టు బన్నీ చెప్పుకొచ్చాడు.
Copyright © 2017; www.ap7am.com