సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సానియా మీర్జా!
భారతీయ టెన్నిస్ అందం సానియా మీర్జా త్వరలోనే తెరంగేట్రం చేయబోతోంది. ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు, ఫిలిం మేకర్ ఫర్హాన్ అఖ్తర్ తెలిపాడు. 30 ఏళ్ల సానియా ఆమె తండ్రితో కలసి ఓ చిత్రంలో మెరవబోతోందని ఫర్హాన్ ఈ రోజు హింట్ ఇచ్చాడు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి వివరాలను ఆయన వెల్లడించలేదు. సానియా మీర్జా, ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జాల మధ్య ఉన్న బలమైన ప్రేమానుబంధాల నేపథ్యంలో ఈ చిత్రం ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. 
Copyright © 2017; www.ap7am.com