బాలీవుడ్ యువనటి అనుమానాస్పద మృతి
ముంబైలో 29 ఏళ్ల బాలీవుడ్ యువనటి అంజలి శ్రీవాస్తవ అనుమానాస్పద స్థితిలో మృతి చెంద‌డం అల‌జ‌డి రేపుతోంది. ఈ రోజు ఉద‌యం ముంబై పశ్చిమ అంధేరిలోని తన నివాసంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న‌ట్లు స్థానికులు గుర్తించి, వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు వివ‌రాలు తెలిపారు. నిన్న రాత్రి నుంచి అంజ‌లికి ఆమె బంధువులు ఫోన్ చేస్తున్నార‌ని, అయితే, ఆమె ఫోన్ ఎత్త‌డం లేద‌ని అన్నారు. ఈ రోజు ఉదయం విషయాన్ని గుర్తించిన స్థానికులు తమకు సమాచారం అందించారని అన్నారు. అంజ‌లి రూమ్‌లో సూసైడ్ నోట్ కూడా ల‌భించ‌లేద‌ని చెప్పారు.           
Copyright © 2017; www.ap7am.com