షూటింగులో హీరో రాంచరణ్ కు స్వల్ప గాయాలు!
రాజమండ్రి సమీపంలోని ఓ మారుమూల గ్రామంలో హీరో రామ్ చరణ్ కొత్త చిత్రం 'రంగస్థలం' షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సూర్యోదయానికన్నా ముందే ప్రారంభమై, సూర్యాస్తమయం అయ్యే వరకు కొనసాగుతోంది. ఈ క్రమంలో, ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా... రామ్ చరణ్ కు స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం. అయినప్పటికీ ఆ గాయాలను లెక్కచేయకుండా షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటున్నాడట. ఈ నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. 
Copyright © 2017; www.ap7am.com