‘ట్విట్టర్’లో పది కోట్ల మంది ఫాలోయర్లను సొంతం చేసుకున్న తొలి సెలబ్రిటీగా కేటీ పెర్రీ రికార్డు
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ లో 100 మిలియన్ ఫాలోయర్లు అంటే పది కోట్ల మందిని కలిగిన తొలి సెలబ్రిటీగా అమెరికాకు చెందిన ప్రముఖ పాప్ స్టార్ కేటీ పెర్రీ రికార్డు సృష్టించింది. కేటీ పెర్రీ తర్వాత రెండో స్థానంలో కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్.. 96.7 మిలియన్ ఫాలోయర్స్ ను, మూడో స్థానంలో యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా .. 90.8 మిలియన్ ఫాలోయర్స్ ను కలిగి ఉన్నారు.

 కాగా, 2009లో కేటీ పెర్రీ   ట్విట్టర్ లో తన ఖాతా తెరిచింది. ఏ విషయాన్ని అయినా కేటీ పెర్రీ ట్విట్టర్ లో ప్రకటించిన తర్వాత మీడియాకు తెలియజేస్తుంటుంది. తన ఆల్బమ్స్ ద్వారా విశేషమైన అభిమానులను సొంతం చేసుకున్న కేటీ, ట్విట్టర్ లో తొంభై గంటల పాటు ఇటీవల లైవ్ స్ట్రీమింగ్ చేసింది.
Copyright © 2017; www.ap7am.com