నాని కొత్త సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను: రాజమౌళి
నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం ‘నిన్నుకోరి’ ట్రైలర్ కు అద్భుత స్పంద‌న వ‌స్తోంది. హిట్‌ల మీద హిట్లు కొడుతున్న నాని మ‌రో హిట్‌ను కొట్ట‌బోతున్నాడంటూ ఆయ‌న‌పై అభిమానులు, సినీ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కి యూట్యూబ్‌లో 30 లక్షలకు పైగా వ్యూస్ వ‌చ్చాయి. అంతేకాదు, 60 వేలకు పైగా లైక్స్‌ని సాధించింది. ఈ ట్రైల‌ర్ చూసిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి వ‌చ్చేనెల 7న విడుద‌ల కానున్న ఈ సినిమాని ఫ‌స్ట్‌డే ఫ‌స్ట్ షో చూస్తాన‌ని అన్నారు. ఈ ట్రైల‌ర్ అద్భుతంగా ఉంద‌ని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.
Copyright © 2017; www.ap7am.com