తన ప్రేమ కథలో ఎవరికీ తెలియని విషయాలను వెల్లడించిన అల్లు అర్జున్
సరైన సమయంలో, సరైన ఎంపిక చేసుకోవాలంటూ యువతను ఉద్దేశించి అల్లు అర్జున్ అన్నాడు. తన ప్రేమ గురించి మాట్లాడుతూ, ఎవరికీ తెలియని ఒక విషయాన్ని బన్నీ తెలిపాడు. ఒకానొక సమయంలో తనకు ఒక పెద్ద సమస్య వచ్చిందని చెప్పాడు. తన ప్రియురాలు స్నేహారెడ్డి వద్దకు వెళ్లాలా? లేక షూటింగ్ కోసం మనాలి వెళ్లాలా? అనే సందిగ్దత తలెత్తిందని తెలిపాడు. వెళితే షూటింగ్ కు వెళ్లిపోవడం, లేకపోతే షూటింగ్ ను మధ్యలో కట్ చేస్తూ స్నేహను కలుస్తుండటం... రెండింటిలో ఒక ఛాయిస్ మాత్రమే తీసుకోవాల్సిన సందర్భమని చెప్పాడు. ఒక వేళ షూటింగ్ కోసం మనాలి వెళ్తే, స్నేహను మిస్ అయిపోతానేమో అనే భయం తలెత్తిందని తెలిపాడు. అయితే, వృత్తికే ప్రాధాన్యతను ఇచ్చి షూటింగ్ కే వెళ్లాలని డిసైడ్ అయ్యానని చెప్పాడు. అప్పుడు తాను సరైన నిర్ణయం తీసుకున్నానని... ఒక వైపు స్నేహ ప్రేమను పొందానని అదే సమయంలో సూపర్ హిట్ మూవీ 'దేశముదురు' సినిమాను పూర్తి చేశానని చెప్పాడు. యువత ఎప్పుడూ సరైన నిర్ణయాలను తీసుకుంటూ, ముందుకు సాగాలని సూచించాడు. స్నేహా రెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 
Copyright © 2017; www.ap7am.com