నిఘా సంస్థల కంట్లో కేరళలోని 'గాజా స్ట్రీట్’!
కేరళ రాష్ట్రంలో ఆకతాయిలు చేసిన ఓ పని కేంద్ర నిఘా సంస్థల కళ్లలో పడింది. కాసరగాడ్ మున్సిపాలిటీలోని తురుత్తి వార్డులో ఓ వీధికి 'గాజా స్ట్రీట్' అనే పేరుతో ఇటీవల బోర్డు వెలిసింది. ఇజ్రాయెల్ పరిధిలోని వివాదాస్పద ప్రాంతం గాజాను పాలస్తీనియన్లు స్వయం పాలిత ప్రాంతంగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతం పేరు కేరళలో వెలవడడాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో, జాతీయ దర్యాప్తు సంస్త (ఎన్ఐఏ)లు తేలిగ్గా తీసుకోవడం లేదు. ఈ చర్య వెనుక తీవ్రమైన ప్రభావం ఉండి ఉంటుందని భావిస్తున్నారు.

ఈ ప్రాంతానికి సమీపంలోని పదానే నుంచి 21 మంది యువకులు 2016 నుంచీ కనిపించకుండా పోయిన నేపథ్యంలో వారు ఇస్లామిక్ స్టేట్ అనే ఉగ్రవాద సంస్థలో చేరి ఉంటారని సందేహాలున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఐబీ, ఎన్ఐఏ ఈ జిల్లాపై నిఘా పెట్టాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అవి తమ నిఘాను మరింత ముమ్మరం చేశాయి. 
Copyright © 2017; www.ap7am.com