పాక్ విజయం నేపథ్యంలో.. సంబరాలు చేసుకున్న కశ్మీరీ యువత!
ఐసీీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుపై పాక్ విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని కశ్మీరీ యువత రెచ్చిపోయింది. క్రికెట్ మ్యాచ్ ముగిసిన అనంతరం యువకులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. యువతకు తోడు మహిళలు కూడా వీధుల్లోకి రావడం విశేషం.

శ్రీనగర్‌ లోని పాతబస్తీలో ఫరా కాదల్‌, సెకిదాఫార్‌ ప్రాంతాల్లో సంబరాలు మిన్నంటాయి. కొంత మంది అత్యుత్సాహవంతులు బాణాసంచా కాల్చి సీఆర్ఫీఎఫ్‌ క్యాంపులు, స్థానిక పోలీస్‌ స్టేషన్లలోకి విసిరారు. అయితే భద్రతాసిబ్బంది సంయమనం పాటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో యువకులు డప్పులు వాయించి సంబరాలు చేసుకున్నారు. 
Copyright © 2017; www.ap7am.com