తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్ పై మోదీ ప్రశంసలు
భారత ఏస్ షట్లర్, తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్ ఇండోనేషియన్ ఓపెన్ లో సత్తా చాటి, టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ప్రపంచ 22వ ర్యాంకర్ అయిన శ్రీకాంత్ జపాన్ కు చెందిన సకాయ్ పై 21-11, 21-19తో ఘన విజయం సాధించాడు. శ్రీకాంత్ కెరియర్లో ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్ కావడం విశేషం.

ఈ నేపథ్యంలో, శ్రీకాంత్ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. శ్రీకాంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. "ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ లో నీవు సాధించిన ఘన విజయాన్ని చూసి ఎంతో ఆనందపడుతున్నాం" అంటూ మోదీ ట్వీట్ చేశారు. 
Copyright © 2017; www.ap7am.com