కశ్మీరీ వేర్పాటు వాద నాయకుడు ఉమర్ ఫరూఖ్ కు గడ్డి పెట్టిన గంభీర్!
కశ్మీరీ వేర్పాటు వాద నాయకుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ వ్యవహార శైలిపై క్రికెటర్ గౌతమ్ గంభీర్ మండిపడ్డారు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పై పాక్ ఘన విజయం సాధించడంతో ఫరూఖ్ తెగ సంబరపడిపోతున్నాడు. తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేయడమే కాకుండా అన్ని చోట్లా టపాసులు పేలుతున్నాయని, ఈద్ ముందే వచ్చిందని, చక్కని జట్టు అంటూ పాకిస్థాన్ టీమ్ కు అభినందనలు తెలిపాడు.

దీనికి గంభీర్ ఘాటుగా స్పందించాడు. పాకిస్థాన్ జట్టు గెలిచిందన్న సంబరాలను పాక్ కు వెళ్లి జరుపుకోవచ్చుగా, కశ్మీర్ లో ఎందుకంటూ ప్రశ్నించాడు. ‘‘మిర్వాయిజ్ కు ఓ సలహా. నువ్వు సరిహద్దు ఎందుకు దాటకూడదు. మంచి టపాసులు (చైనీస్) నీకు లభిస్తాయి. ఈద్ అక్కడే జరుపుకోవచ్చు. టపాసులు ప్యాక్ చేసి నీకిస్తాను’’ అంటూ గంభీర్ ట్వీట్ చేశాడు. మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ పాకిస్థాన్ జట్టుకు అభినందనలు తెలపడం ఇదే మొదటిసారేమీ కాదు. ఇంగ్లడ్ పై గెలిచినప్పుడూ ఆయన ఇంతే సంబరపడిపోయాడు
Copyright © 2017; www.ap7am.com