పాక్ క్రికెటర్లకు 'ఉమ్రా' ప్రకటించిన ఆర్మీ చీఫ్!
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ పై ఘన విజయం సాధించిన పాక్ క్రికెటర్లపై ఆ దేశంలో ప్రశంసల జల్లు కురుస్తోంది. మరోవైపు జట్టు సభ్యులకు వరాల జల్లు కూడా మొదలైంది. ఫైనల్స్ ముగిసిన కాసేపటికే ఆ దేశ ఆర్మీ చీఫ్ బజ్వా తమ ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. జట్టు సభ్యులకు 'ఉమ్రా' ప్రకటించారు. సైన్యం తరపును జట్టు సభ్యులను ఉమ్రా యాత్రకు పంపుతున్నట్టు తెలిపారు. ముస్లింలు చేపట్టే మక్కా తీర్థయాత్రను ఉమ్రా అంటారు.  
Copyright © 2017; www.ap7am.com