పిడుగుపడి అస్తవ్యస్తమైన రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ!
పిడుగుపడటంతో రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ అస్తవ్యస్తమైన ఘటన తెలంగాణలో జరిగింది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి సమీపంలో ఈ తెల్లవారుజామున రైల్వే సిగ్నల్ పై పిడుగుపడింది. దీంతో, సిగ్నలింగ్ వ్యవస్థ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ భారతదేశాలను కలిసే రైలు మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  ఏపీ సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ తో పాటు, స్వర్ణ జయంతి ఎక్స్ ప్రెస్ లు పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో నే నిలిచిపోయాయి. మరోవైపు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ ను రాఘవపూర్ సమీపంలోనే నిలిపివేశారు. రైల్వే అధికారులు సిగ్నలింగ్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు యత్నిస్తున్నారు. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
Copyright © 2017; www.ap7am.com