క్రికెట్ పై కోపాన్ని టీవీల మీద చూపించిన ఫ్యాన్స్!
ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ ఓటమిపాలు కావడాన్ని సగటు అభిమాని జీర్ణించుకోలేకపోయాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు పూజలు, హోమాలు చేసి సానుకూలంగా స్పందించారు. మ్యాచ్ తొలి ఓవర్లలోనే వికెట్ పడడంతో 'ఫర్వాలేదు, కోహ్లీ ఆదుకుంటాడ'ని భావించారు. కోహ్లీ అవుటయ్యాక యువీ, ధోనీ ఆదుకుంటారని చూశారు. వారు కూడా చేతులెత్తేశారు. దీంతో హార్డిక్ మెరుపులు చూసి ఆశగా టీవీల ముందు కూర్చున్నారు. జడేజా నిర్వాకంతో అతను కూడా పెవిలియన్ చేరాడు. దీంతో ఆశలన్నీ ఆవిరయ్యాయి. అప్పుడు కానీ ఓడిపోతున్నామని సగటు టీమిండియా అభిమాని నిర్ణయానికి రాలేకపోయాడు.

 ఎవరో ఒకరు మెరుస్తారు. ఆకట్టుకుంటారు. జట్టుతో పాటు దేశాభిమానుల భావోద్వేగాలను గెలిపిస్తారని ఆశపడ్డారు. ఆశలన్నీ అడియాసలు కావడంతో అభిమానులు మండిపడ్డారు. మ్యాచ్ ఫిక్సైందన్నారు. పాక్ బౌలర్ల ప్రతిభను పట్టించుకోకుండా....తమ టీవీలు పగులగొట్టారు. టీమిండియా క్రికెటర్లను దూషించారు. చేతకాని వారంటూ విమర్శలు కురిపించారు. కాన్పూర్ అభిమానులు ఒక అడుగు ముందుకు వేసి టీమిండియా క్రికెటర్ల దిష్టిబొమ్మలు, పోస్టర్లు తగులబెట్టారు.
Copyright © 2017; www.ap7am.com