ఫోన్ మాట్లాడుతూ మేడపై నుంచి కిందపడిన విద్యార్థిని మృతి
ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒంగోలు పట్టణంలోని భాగ్యనగర్‌ లో ఈ తెల్లవారుజాము 3.30 గంటలకు ఫోన్‌ మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి జారిపడి బీటెక్‌ విద్యార్థిని మృతి చెందింది. భాగ్యలక్ష్మీ నగర్ లోని మహాలక్ష్మి అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న త్రిపుర అనే విద్యార్థిని ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగం కూడా సంపాదించుకుంది. హైదరాబాదులో ఉద్యోగంలో జాయిన్ కావాల్సి ఉంది. దీంతో త్రిపుర కుటుంబ సభ్యులు పిండివంటలు చేశారు. దీంతో తెల్లవారుజాము 3 గంటల వరకు కుటుంబ సభ్యులు మేల్కొని ఉన్నారు. అయితే మేడమీదకి వెళ్లిన త్రిపుర అక్కడి నుంచి జారిపడింది. కిందపడగానే తలపగిలిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ అపార్ట్ మెంట్ లో విషాదం నెలకొంది. 
Copyright © 2017; www.ap7am.com