భారతీయుల నల్లధనం మా బ్యాంకుల్లో లేదు: స్విస్ ప్రైవేటు బ్యాంకుల సంఘం స్పష్టీకరణ
నల్లకుబేరులు స్విస్ బ్యాంకుల్లో భారీ ఎత్తున నల్లధనం దాచుకున్నారని, తాము అధికారంలోకి వస్తే ఆ ధనాన్నంతా వెనక్కి తీసుకువస్తామని గత ఎన్నికల ముందు బీజేపీ విపరీతంగా ప్రచారం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో సమాచార మార్పిడికి 2015లో కేంద్రం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం త్వరలో అమలులోకి రానుంది. ఈ క్రమంలో స్విస్ ప్రైవేటు బ్యాంకుల సంఘం తాజాగా ఒక ప్రకటన చేసింది. భారతీయుల నల్లధనం స్విస్ బ్యాంకుల్లో లేదని ప్రైవేటు బ్యాంకుల సంఘం స్పష్టం చేసింది. భారతీయులు తమ నల్ల ధనాన్ని స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడాని కన్నా, సింగపూర్‌, హాంకాంగ్‌ వంటి చోట్ల దాచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని స్విస్‌ ప్రైవేటు బ్యాంకుల సంఘం తెలిపింది.
Copyright © 2017; www.ap7am.com