చంద్రబాబుకు కృతఙ్ఞతలు తెలిపిన భూమా బ్రహ్మానందరెడ్డి
నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు భూమా బ్రహ్మానందరెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలులో ఆయన మాట్లాడుతూ, ఏవీ సుబ్బారెడ్డి, ఫరూక్ సహకారంతో ఉప ఎన్నికల్లో తాను గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. కాగా, దివంగత నేత భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు నిన్న ప్రకటించారు.
Copyright © 2017; www.ap7am.com