ఇది మనిషి నైజం... బిచ్చగాడి నుంచి డబ్బులు తీసుకునేందుకు వాళ్లు ఏమాత్రం సిగ్గు పడలేదు.. వీడియో చూడండి!
Advertisement
సామాజిక పరిశోధన కోసం ఆస్ట్రేలియాలోని మెల్‌ బోర్న్ కి చెందిన ‘డాం ది మాప్స్’ ఆసక్తికర అంశాన్ని ఎంచుకుంది. సమాజంలో వివిధ రకాలైన వ్యక్తులు ఉంటారు. వారి మనస్తత్వాలను తెలుసుకునేందుకు ఈ సంస్థ ఈ సామాజిక పరిశోధన నిర్వహించింది. ఈ పరిశోధనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.... ఈ ప్రయోగం ఎలా జరిగిందంటే....గ్రీన్ (39) అనే వ్యక్తికి బిచ్చగాడి వేషం వేయించింది. మొల్ బోర్న్ లోని రద్దీ వీధిలో కూర్చోబెట్టి, అతనికి 100 డాలర్ల చిల్లర నాణేలను ఇచ్చి...ఒక బాక్స్ లో ఉంచింది. అతని ముందు ఒక అట్టపై ‘నా దగ్గరున్న డబ్బు నాకు అవసరం లేదు. కావాలంటే తీసుకోండి’ అని రాసిన బోర్డును ఉంచింది. ఈ తతంగాన్నంతా వీడియోగా చిత్రీకరించింది.

ఆ వీధిలో 2 గంటల 30 నిమిషాల్లో 10,000 మంది అతనిని చూస్తూ, ఆ బోర్డు చదువుతూ వెళ్లిపోయారు. అతని దగ్గర డబ్బులు తీసుకునేందుకు చాలా మంది వెనుకాడగా, కొందరు మాత్రం ఏమాత్రం సిగ్గు లేకుండా డబ్బులు తీసుకెళ్లారు. కొంత మంది అతనికి బిచ్చం వేసే ప్రయత్నం చేశారు. ఒక యువతి డబ్బుకు ప్రాధాన్యత లేదని బాగా చెబుతున్నావని అభినందించి అతనికి కాఫీ కూడా ఇచ్చింది. అయితే కొంతమంది మాత్రం ఏమాత్రం సిగ్గూ లేకుండా అతని ముందు ఉంచిన 99 డాలర్ల కాయిన్స్ ను ఖాళీ చేసేశారు.

ఆ సన్నివేశాల వీడియోను 'మనిషి తీరిది' అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయగా అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఆ వీడియో మీరు కూడా చూడండి.


Fri, Jun 09, 2017, 06:58 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View