రాణి ఎలిజబెత్ కుటుంబంలో ఈ పదాలకు చోటులేదు!
Advertisement
రాజ కుటుంబాల జీవనశైలి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సాధారణంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎందుకంటే, వారు తీసుకునే ఆహారం, ధరించే డ్రెస్సులు, ఖరీదైన ఆభరణాలు, వినియోగించే వాహనాలు, పార్టీలు.. ఇలా ప్రతి ఒక్కటీ ఆసక్తిదాయకమే. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ధరించే కొత్త షూ సరిగా ఉన్నాయో లేదో సరి చూసే ఉద్యోగులను ‘ఫుట్ విమెన్’ గా పిలుస్తారని, ఆమె వద్ద పని చేసే డిజైనర్ స్టీవర్ట్ పర్విన్ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.

కాగా, రాణి గారి కుటుంబానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం తెలిసింది. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త కేట్ ఫాక్స్ మాట్లాడుతూ, సాధారణంగా వాడే ఇంగ్లీషు పదాలను ఎలిజబెత్-2, ఆమె కుటుంబీకులు అస్సలే వాడరట. ఆ పదాలేమిటంటే.. పార్డన్, టాయ్ లెట్, పెర్ ఫ్యూమ్, పాష్. మరి, ఆ పదాలకు ప్రత్యామ్నాయంగా ఏ పదాలను రాణీ గారు, ఆమె కుటుంబీకులు వాడతారంటే.. ‘పార్డన్’ స్థానే ‘సారీ వాట్’, ‘టాయ్ లెట్’కు బదులు ‘లూ’, ‘పెర్ ఫ్యూమ్’, ‘పాష్’ స్థానాల్లో వరుసగా ‘సెంట్’, ‘స్మార్ట్’ అనే పదాలను వాడతారు. అదీ సంగతి! 
Sun, May 21, 2017, 05:43 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View