సికింద్రాబాద్- కాకినాడ ఎక్స్ ప్రెస్ లో బంగారం చోరీ
Advertisement
సికింద్రాబాద్- కాకినాడ గౌతమి ఎక్స్ ప్రెస్ లో బంగారం చోరీ జరిగింది. ఈ రైలు విజయవాడ సమీపంలోని రాయనపాడుకు చేరుకునే సమయంలో ప్రయాణికుల నుంచి రూ.లక్ష విలువైన బంగారాన్ని దుండగులు దోచుకుని ఉడాయించారు. వెంటనే దగ్గరలోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sat, Apr 11, 2015, 10:51 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View